తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2/5
నిర్మాణ సంస్థ : SLV సినిమాస్
నటీనటులు: నాని, మోహన్ బాబు, కాయదు లోహర్, కీర్తి సురేష్, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం : అనిరుధ్,
సినిమాటోగ్రఫి: సాయి సీహెచ్,
ఎడిటర్: నవీన్ నూలి,
ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్ కోల్ల,
మాటలు : తోట శ్రీనివాస్,
క్యాస్టూమ్ డిజైనర్: అజయ్ కుమార్ జే,
సౌండ్ డిజైన్: సురేన్ జీ, అలగై కూతన్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
విడుదల తేది : 24.09.2026
నిడివి :2 ఘంటల 49 నిముషాలు
నాని(Nani)) గతం లో ఎప్పుడు చేయని సరికొత్త గెటప్ తో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘ది ప్యారడైజ్’.(The Paradise) సూపర్ హిట్ మూవీ ‘దసరా’ సినిమా కాంబినేషన్పై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు,(Dr Mohan Babu) కయాదు లోహర్,(Kayadu Lohar) రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై అంచనాల్నిపెంచేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ సినిమా స్టోరీ ‘సవాల్’ అనే అణచివేతకు గురైన ఓ గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. బ్రిటీష్, నైజాం పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్లో ప్యారడైజ్ ప్రాంతాన్ని సంపన్న వర్గానికి చెందిన శిఖంజి మాలిక్ (మోహన్ బాబు) కుటుంబీకులు పాలిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకొని అక్కడి ప్రజలను శాసిస్తుంటారు. అదే ప్రాంతంలో ఎన్నో ఏళ్ల క్రితం వలస వచ్చిన సవారీ తెగ వాళ్లు తమ గుర్తింపు, పౌరసత్వం కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) నాయకత్వంలో పోరాటం చేస్తుంటారు. ఈ పోరాటంలోనే సమ్మక్క జడల్ (నాని)కి జన్మనిస్తుంది. తన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఓ సారి జడల్ చిన్నతనంలో బిర్యానీ దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. అది తెలుసుకున్న శిఖంజి మాలిక్ లం….కొడుకు అని పచ్చ బొట్టు వేయిస్తాడు. చిన్నతనంలోనే మాలిక్ కుటుంబాన్ని ఎదురించి జడల్ జైలుకు వెళ్తాడు. పద్నాలుగేళ్ళ తరువాత జడల్ జైలు నుండి తిరిగి వస్తాడు. శిఖంజి మాలిక్ పై పగ తీర్చుకోవాలనే ప్రతీకారం తో రగిలిపోతుంటాడు. అది ఇలా వుండగా తన తల్లి ఒక వేశ్య అని నమ్ముతూ తన తల్లి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇదే సమయం లో యాక్టర్ కావాలనే సుబ్బు(కాయదు లోహర్) తో ప్రేమలో పడతాడు. ప్యారడైజ్ ప్రాంతంలో ప్రజలపై మాలిక్ వర్గం ఎలాంటి వేధింపులకు గురైంది? సమ్మక్క ఉద్యమంపై మాలిక్ వర్గం ఎలా ఉక్కుపాదం మోపింది? జడల్ పుట్టుక ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? తన కొడుకుకు జడల్ జమానా అని పేరు ఎందుకు పెట్టారు? తల్లిపై జడల్ ఎందుకు ద్వేషం పెంచుకొన్నాడు? మాలిక్ పతనం చూడాలని జడల్ ఎందుకు నిర్ణయించుకొన్నాడు? సుబ్లలక్ష్మీ అలియాస్ సుబ్బు తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? తల్లితో జడల్ కలిశాడా? మాలిక్ పతనానికి జడల్ ఎలాంటి వ్యూహం పన్నాడు? ప్యారడైజ్లో సవారీలకు గుర్తింపు లభించిందా? తన ప్రజలకు ప్రత్యేక గుర్తింపును, హక్కులను ఎలా తెచ్చిపెట్టాడనేదే ఈ సినిమా స్టోరీ.
నటీ నటుల హవబవాలు :
ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే నాని మరోసారి తన శక్తికి మించిన ప్రయత్నమే చేశాడనిపిస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎలా చెబితే అలా చేశాడనే విషయం పలు సీన్లు చూసిన తర్వాత క్లారిటీ లభిస్తుంది. తన ఇమేజ్కు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలో ఒదిగిపోయి.. కథను తన భుజానికి ఎత్తుకొని నడిపించాడు. పలు సీన్లలో నాని నటన బ్రహ్మండంగా ఉంటుంది. అయితే ఎమోషనల్గా సాగాల్సిన తన క్యారెక్టర్ను అతిగా యాక్షన్ చేసి ట్రాక్ తప్పేలా చేశాడనిపిస్తుంది. ఇక శిఖంజీగా మోహన్ బాబు తన మార్కు నటనను ప్రదర్శించారు. చాలా రోజుల తర్వాత మళ్లీ నెగిటివ్ క్యారెక్టర్లో చెలరేగిపోయాడు. ఇంకా ఆ పాత్రను కొనసాగిస్తే మంచి అవుట్పుట్ వచ్చి ఉండేది. విక్రమ్ మాలిక్గా రాఘవ్ జుయల్ను, బిర్యానిగా సంపూని పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా డిజైన్ చేయలేకపోయారు. తల్లి పాత్రలో సొనాలి కులకర్ణి జీవించారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఒకే అనిపిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్గా చూస్తే ఫుల్ ఎమోషనల్గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలనుకొన్న కథను పర్ఫెక్ట్ ఫ్లోలో చెప్పలేకపోయాడనే విషయం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. అలా కథ నడిచిన కొద్ది ట్రాక్ మిస్ అవుతున్నాడనే విషయంపై ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్యారడైజ్ వరల్డ్ను అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఇక స్లమ్ కమ్యూనిటీని సినిమాటోగ్రాఫర్ బాగా సెట్ చేశారు. కలర్ టోన్, లొకేషన్స్, వర్షం జల్లుల సీన్ల క్లాసీగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమా డైలాగ్స్పై మ్యూజిక్ డామినేట్ చేసింది. చాలా సందర్బాల్లో చెవులు నిక్కరించి డైలాగ్స్ వినేందుకు ప్రయాస పడాల్సి వచ్చింది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ ఫ్లో అంతంత మాత్రంగానే ఉంది. ఓ సీన్ నుంచి ఇంకో సీన్కు అకస్మాత్తుగా మారిపోతుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. నిర్మాత సుధాకర్ చెరుకూరి అనుసరించిన నిర్మాణ విలువలు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ రిచ్నెస్తో రూపొందించారు.
విశ్లేషణ :
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పాతకాలపు రొటీన్ స్టోరీనే ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా స్టోరీలో ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా నిలించింది. నాని క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్ర కూడా హలంగా నమోదు కాకపోవడం నిరాశపరుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ లాంటి నటులను సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. పూర్తి స్తాయిలో హింసాత్మకమైన సన్నీవేషాలతో నరకం లో వున్నామా? టైటిల్ ప్యారడైజ్ కాని సినిమా చూస్తున్నంత సేపు రక్తం చిందించే కబేళ లో వున్నామా అనిపిస్తుంది. ది ప్యారడైజ్ నరమేధాన్ని తలపించే నరకం అనిపించక తప్పదు. ప్యారడైజ్ కాదు ఇది ఒక హెల్….
