ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది. ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజు వసూళ్లలో నాని గత సినిమాలైన ‘దసరా’, ‘హిట్ 3’ రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసింది. నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు..
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం, ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.34.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా 47 శాతానికి పైగా థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.25.10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నాని గత చిత్రాలతో పోలిస్తే.. ‘దసరా’ ఫస్ట్ డే దాదాపు రూ.23.20 కోట్లు, ‘హిట్ 3’ రూ.21 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, వాటిని ఈ సినిమా వెనక్కి నెట్టింది.
రికార్డు స్థాయి ప్రీమియర్స్ ..
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారత్‌లో రూ.23.5 కోట్ల గ్రాస్ వసూలు కాగా, ప్రీమియర్స్ ద్వారా మరో రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
నటీనటులు , సాంకేతిక నిపుణులు..
ఈ మాస్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, కీర్తి సురేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
