తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 2.25/5
నిర్మాణ సంస్థ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్,
నటీనటులు: సూరీ, సుహాస్, మహిమ నంబియార్, సత్యరాజ్, మిథున్, జై శంకర్, రవీంద్ర విజయ్, బాలశరవణన్, స్టన్ శివ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్,
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కథిర్,
ఎఢిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, నిషార్ షరీఫ్,
ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్కే కిరణ్,
స్టంట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్ మహేష్ మ్యాథ్యూ,
సహ నిర్మాత: వీ మణికందన్
సమర్పణ: ఎల్రెడ్ కుమార్
నిర్మాత: ఎల్రెడ్ కుమార్
దర్శకత్వం: మాథిమారన్ పుగళేంది
విడుదల తేది : 10.09.2026
నిడివి : 2 ఘంటల 34 నిముషాలు
కోలీవుడ్ కమెడియన్ సూరి,(Soori) టాలీవుడ్ హీరో సుహాస్ (Suhaas)తొలి సారిగా తమిళ మూవీ ప్రతి నాయకుడి పాత్రల్లో నటించిన చిత్రం మండాడి (Mandaadi) అదే పేరుతో తెలుగులోనూ రిలీజైంది. అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ప్రొడ్యూసర్ కావడం, ట్రైలర్స్, టీజర్ కొత్తగా ఉండటంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్లో ఆసక్తిని రేకెత్తించింది. మండాడి మూవీకి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. మహిమా నంబియార్ హీరోయిన్గా నటించింది. రులర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో నిన్న గురువారం థియేటర్లలో రిలీజైంది. మండాడి ఎలా ఉంది? ఈ తమిళ మూవీ తెలుగు ఆడియెన్స్ను మెప్పించిందా? సమీక్షలో చూద్దాం!
కథ:
కళింగపట్నంకు చెందిన ముత్తుకాళి (సూరి) సముద్రంలో వేటను కొనసాగించే నైపుణ్యమైన జాలరి, లెజెండరీ బోట్ రేసర్. చిన్నతనం నుంచి సట్టైపులి (సుహాస్)ప్రాణ స్నేహితులు. ఆ ప్రాంతంలో ఎన్నో తెరచాప పడవ పోటీల్లో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న ముత్తు కాళి, సట్టైపులి మధ్య ఓ కారణంగా విభేదాలు ఏర్పడుతాయి.దాంతో కాళి, పులి గ్రూపుల మధ్య గొడవలు తీవ్రమవుతాయి. దాంతో ఇద్దరు బద్ద శత్రువులుగా మారుతారు. కొన్ని పరిస్థితుల కారణంగా బోట్ రేసింగ్ను వదిలి ముత్తుకాళి హైదరాబాద్లో స్విమ్మర్గా సాధారణ జీవితం గుడుపుతుంటాడు. ఈ క్రమంలో పడవ పందెల్లో విభేదాలు ముదిరి సట్టైపులిపై హత్యప్రయత్నం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ముత్తుకాళి మళ్లీ ఊరి కోసం సట్టైపులితో పడవ పందానికి సై అనాల్సి వస్తుంది. సాట్టపులికి వ్యతిరేకంగా మల్లేషం (మిథున్ జై శంకర్)ల ఓ టీమ్ తయారు చేస్తాడు. వారికి మునయ్య (సత్యరాజ్) ట్రైనింగ్ ఇస్తాడు. అది సహించలేని సాట్టాపులి మనుషులు మల్లేషాన్ని చంపాలని అనుకుంటారు. అతడిని కాళి కాపాడుతాడు. మునయ్య కూతురు ఏంజెల్ను (మహిమా నంబియార్) కాళి ప్రేమిస్తాడు. తాను ఎదగడం కోసం సాట్టాపులి చేసిన కుట్రల వల్ల మునయ్య చనిపోతాడు. ఆ గొడవల కారణంగా తాను ప్రేమించిన ఏంజెల్కు దూరమైన కాళి కళింగపట్నం వదిలివెళ్లిపోతాడు. ముత్తుకాళి, సట్టైపులి మధ్య పడవ పందాలు ఎలా సాగాయి? ప్రాణ స్నేహితులైన ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? లెజెండరీ బోట్ రేసర్ తన గ్రామం నుంచి బయటకు వచ్చి హైదరాబాద్లో స్విమ్మింగ్ కోచ్గా ఎందుకు జీవితాన్ని గడపాల్సి వచ్చింది? ముత్తుకాళి, ఏంజెల్ మధ్య రిలేషన్ ఎలా కొనసాగింది? సట్టైపులిపై ఎందుకు హత్యాప్రయత్నం జరిగింది? ఎవరు హత్యా ప్రయత్నం చేశారు? మళ్లీ కళింగపట్నం కోసం కళింగ వారియర్ తరఫున ముత్తుకాళి పరుగు పందెంలో ఎందుకు పాల్గొన్నారు. పరుగు పందాన్ని గెలువడానికి సట్టైపులి చేసిన కుట్రలు ఏమిటి? సట్టైపులి కుట్రలను ఎదురించి.. పడవ పందాన్ని ముత్తుకాళి ఎలా గెలిచాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మండాడి సినిమా కథ.
నటీ నటుల హవబవాలు :
చిన్నచిన్న క్యారెక్టర్లతో సినీ జీవితాన్ని ప్రారంభించిన సూరి, అదే విదంగా తెలుగు తన కెరిర్ కొనసాగిస్తున్నసుహాస్ ఈ సినిమాను తమ భుజాలపై మోయడం డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయి జీవించారనే చెప్పాలి. ముత్తుకాళిగా సూరి, సట్టై పులిగా సుహాస్ తమ కెరీర్లో మరోసారి బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. వారి బాడీలాంగ్వేజ్, మ్యానరిజమ్స్ డిఫరెంట్ లుక్లలో ఇద్దరు కూడా చూపించిన వేరియేషన్ బాగుంది. మహిమా నంబియార్ నాచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఓ కీలక పాత్రల్లో సత్యరాజ్ కనిపించారు. హీరోకు గురువుగా హుందాగా అతడి పాత్ర సాగింది. రవీంద్ర విజయ్ మినహా తెలుగు ఆడియెన్స్కు తెలిసిన నటులు ఈ సినిమాలో లేరు. ఏంజెల్ కొడుకుగా మిథున్ జై శంకర్ తన పాత్రకు మేర నటించాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
తెరచాప పందెం పోటీలు అనే సరికొత్త కాన్సెప్ట్తో దర్శకుడు మతిమారన్ పుగలేంది ఈ కథను రాసుకున్నారు. పోటీల వరకు కథ కొత్తగా ఉంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న డ్రామా చాల రొటీన్గా సాగింది. కథను ట్విస్ట్లు, టర్న్లతో ఎంగేజింగ్గా నడిపించడంలో దర్శకుడు తడబడిపోయాడు. టెక్నికల్గా మాత్రం జీవీ ప్రకాష్ మ్యూజిక్, ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ మండాడికి బ్యాక్బోన్గా నిలిచాయి. నిజమైన తెరచాప పోటీలు చూసిన ఫీలింగ్ను తన విజువల్స్తో ఆడియెన్స్లో కలిగించారు కెమెరామెన్ కథిర్. సముద్రంలో పడవ పందాలను రిచ్గా, ఐ క్యాచీగా చిత్రీకరించారు. ఆ సీన్లకు జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ బాగుంది. దర్శకుడి విజన్ను నమ్మి ప్రొడ్యూసర్లు సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు.
విశ్లేషణ :
ఇప్పటివరకు సౌత్ ఇండియన్ మూవీస్ లో స్పోర్స్ట్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఎక్కువగా క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్…ఆటల నేపథ్యంలోనే వచ్చాయి. వాటికి భిన్నంగా ఓ నిజాయితీతో కూడిన ప్రయత్నంగా మండాడి నిలిచింది. కాని ఈ తెరచాప పడవ పోటీల చుట్టూ ఫెయిల్యూర్ లవ్స్టోరీ, రివేంజ్ డ్రామాతో దర్శకుడు మతిమారన్ ఈ కథను రాసుకున్నాడు. అక్కడే దెబ్బ వేసింది… ఈ కథకు సూరి, సుహాన్ లాంటి నాచురల్ పర్ఫార్మర్లు దొరకడం ప్లస్సయ్యింది. ఇద్దరూ పోటీపడి నటించారు. సూరికి ధీటుగా సుహాస్ పాత్రను దర్శకుడు రాసుకున్న ఎస్లాబ్లిష్ చేయడం బాగుంది. తెలుగు డబ్బింగ్, టైటిల్స్ విషయంలో క్వాలిటీ లేదు. హీరోతో పాటు మిగిలిన ప్లేయర్స్ ధరించే జెర్సీలపై పేర్లు ఓ సారి తమిళంలో మరోసారి తెలుగులో కనిపిస్తాయి. సుహాస్ పేరు, టైటిల్ కూడా తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్స్ బిల్డ్ చేస్తూ వెళ్లారు డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అదే విదంగా కథ, కథనాలపై ఇంకా బెటర్గా వర్క్ చేసి ఉంటే.. డెఫినెట్గా మంచి ఫలితం దక్కి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే కంటెంట్ను ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
