అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రసిద్ధ ‘ఫ్రీమాంట్ హిందూ టెంపుల్’(Fremont Hindu Temple)లో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. నవంబర్ 8, 2026 ఆదివారం రోజున సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా 1008 దీపాల వెలుగులతో ప్రత్యేక లక్ష్మీ పూజను నిర్వహించనున్నారు.
ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి స్వయంగా దీపం వెలిగించి, అంధకారాన్ని తొలగించుకుని దైవ కృపతో సుఖసంతోమలు పొందడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం www.fremonttemple.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా (510) 659-0655 నంబర్‌ను సంప్రదించవచ్చు.
