సౌత్ కాలిఫోర్నియా వైష్ణవ సమాజం (Shrinathji Haveli, Vaishnav Samaj of SoCal) ఆధ్వర్యంలో ‘శరద్ పూర్ణిమ రాస్ దర్శన్’ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాలిఫోర్నియాలోని ఇర్విన్ నగరంలో ఉన్న శ్రీనాథ్జీ హవేలీ ప్రాంగణంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
వేడుకల వివరాలు ..
ఈ శరద్ పూర్ణిమ వేడుకలు ఆదివారం, అక్టోబర్ 25, 2026 న జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల సమయాలు క్రింది విధంగా ఉన్నాయి.
సాయంత్రం 5:00 గంటలకు: దర్శన్ భీతర్ (Darshan Bhitar) కార్యక్రమం ఉంటుంది.
సాయంత్రం 6:30 గంటలకు: శరద్ పూర్ణిమ రాస్ దర్శన్ (Sharad Purnima Ras Darshan) నిర్వహిస్తారు.
రాత్రి 7:30 గంటలకు: అమిత్ ఆనంద్ (Amit Anand) ఆధ్వర్యంలో శరద్ పూర్ణిమ గర్భా ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది.
భక్తులకు ఉచిత ప్రవేశం ..
ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకకు విచ్చేసే భక్తులందరి సౌకర్యార్థం ఉచిత ప్రవేశం (Free Entry) ఉచిత పార్కింగ్ (Free Parking) సదుపాయాన్ని నిర్వాహకులు కల్పించారు. అంతేకాకుండా, వేడుకకు వచ్చే వైష్ణవులందరికీ శరద్ పూర్ణిమ ప్రసాదంగా ‘దూధ్ పోహా’ (Dudh Poha) పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాద మనోరథిగా మోనా సమీర్ షా వ్యవహరిస్తున్నారు. భక్తి భరితమైన ఈ రాస్, దాండియా వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణుని కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
