ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆయన ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రతిష్టాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా షోస్ స్టాపర్స్ 2026’ (Forbes India Showstoppers 2026) స్పెషల్ ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ కవర్ స్టార్‌గా మెరిశారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సినీ, క్రీడా రంగాలకు చెందిన దేశంలోని టాప్-100 మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులతో పాటు అల్లు అర్జున్ ప్రధాన కవర్ పేజీపై ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. ‘పుష్ప’ చిత్రాల విజయంతో బన్నీ పాన్-ఇండియా స్థాయిలో తన బ్రాండ్ వ్యాల్యూను విపరీతంగా పెంచుకున్నారని ఈ గుర్తింపు నిరూపిస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ (Raaka) షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘AA23’ చిత్రంలోనూ ఆయన పాల్గొననున్నారు.
