రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్ట్లు సృష్టిస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో అదరగొట్టగా, అంతకుమించి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ.
హాలీవుడ్ విలన్ ఎంట్రీ..
గతంలో ‘లైగర్’ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను పరిచయం చేసిన విజయ్ దేవరకొండ, ఈసారి ప్రపంచవ్యాప్తంగా ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ చిత్రాల ద్వారా హైప్రీస్ట్ ఇమ్హోటెప్ పాత్రతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ వోస్లూను విలన్‌గా రంగంలోకి దించారు. ఈ చిత్రంతో ఆయన తొలిసారిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నాల్డ్ వోస్లూ థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ‘హార్డ్ టార్గెట్’, ‘బ్లడ్ డైమండ్’, ‘24’ వంటి పలు ప్రముఖ చిత్రాలు , సిరీస్‌లలో నటించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు.
సినిమాపై భారీ అంచనాలు..
టీజర్లో విజయ్ దేవరకొండ ఎనర్జీకి పోటీగా ఆర్నాల్డ్ వోస్లూ చూపించిన క్రూరమైన విలనిజం సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. విజయ్ – ఆర్నాల్డ్ మధ్య వచ్చే హై-వోల్టేజ్ ఫేసాఫ్ సన్నివేశాలు వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఫీస్ట్‌ను అందించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
