మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ‘సరిపోదా శనివారం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేతులు కలిపారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇటీవల ‘ఇరుముడి’ ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు రవితేజను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్‌ప్లే, రవితేజ ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ కలగలిపితే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ, యువ దర్శకుడు హసిత్ గోలి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
