శాన్ హోస్ (San Jose) నగరంలో ‘అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్’ (AIA) ‘బొల్లి 92.3 ఎఫ్ఎమ్’ (Bolly 92.3 FM) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం, అక్టోబర్ 24, 2026న దీపావళి సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. బే ఏరియా నలుమూలల నుంచి దాదాపు 10 వేల మందికి పైగా భారతీయులు స్థానికులు ఈ రోజంతా సాగిన సాంస్కృతిక సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు శాన్ హోస్ వీధుల్లో సరికొత్త వెలుగులు నింపాయి.
విచ్చేసిన ప్రముఖులు దివ్య దిపారాధన..
ఈ సంబరాలకు శాన్ హోస్ మేయర్ మ్యాట్ మహాన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి, భారతీయ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
మ్యాట్ మహాన్ (Matt Mahan) — మేయర్, శాన్ హోస్
సతీష్ శివన్ (Satish Sivan) — భారత కాన్సుల్ జనరల్, శాన్ ఫ్రాన్సిస్కో
రాజ్ సల్వాన్ (Raj Salwan) — మేయర్, ఫ్రీమాంట్
లారీ క్లెయిన్ (Larry Klein) — మేయర్, సన్నీవేల్
పాల్ జోసెఫ్ (Paul Joseph) — చీఫ్ ఆఫ్ పోలీస్, శాన్ హోస్ సిటీ
టామ్ పైక్ (Tom Pyke) — కాంగ్రెస్మన్ రో ఖన్నా కార్యాలయ ప్రతినిధి
నికోలస్ హార్గిస్ (Nicholas Hargis) — కాంగ్రెస్మన్ సామ్ లిక్కార్డో కార్యాలయ ప్రతినిధి
బెట్టీ డుఓంగ్ (Betty Duong) — శాంటా క్లారా కౌంటీ సూపర్వైజర్
ది-వు న్గుయెన్ (The-Vu Nguyen) — శాంటా క్లారా కౌంటీ సూపర్వైజర్ ఒట్టో లీ కార్యాలయ ప్రతినిధి
బియన్ డోయాన్ (Bien Doan) — శాన్ హోస్ సిటీ కౌన్సిల్ మెంబర్
రోజ్ మేరీ కమేయ్ (Rosemary Kamei) — శాన్ హోస్ సిటీ కౌన్సిల్ మెంబర్
మురళి శ్రీనివాసన్ (Murali Srinivasan) — సన్నీవేల్ సిటీ కౌన్సిల్ మెంబర్
రాజ్ చాహల్ (Raj Chahal) — శాంటా క్లారా సిటీ కౌన్సిల్ మెంబర్
అజయ్ భూటోరియా (Ajay Bhutoria) — బోర్డ్ ఫర్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్, ల్యాండ్ సర్వేయర్స్ అండ్ జియాలజిస్ట్స్
స్కాట్ సకాకిహారా (Scott Sakakihara) — యూనియన్ సిటీ కౌన్సిల్ మెంబర్
కేథీ వతనాబే (Kathy Watanabe) — శాంటా క్లారా యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్
అర్జున్ బత్రా (Arjun Batra) — పూర్వ శాన్ హోస్ సిటీ కౌన్సిల్ మెంబర్
అబ్బి వి (Abby V) — ప్రముఖ గాయకుడు (లైవ్ పర్ఫార్మర్)
సింగర్ అబ్బి వి (Abby V) సంగీత విభావరి

ఈ ఈవెంట్కు సంబంధించిన ఇతర ముఖ్యమైన ప్రతినిధులు స్పాన్సర్లు:
సంజీవ్ గుప్తా (Sanjiv Gupta CPA)
లావణ్య దువ్వి (Lavanya Duvvi)
నాగరాజ్ అన్నాంబయ్య (Nagaraj Annaiah)
ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు అబ్బి వి (Abby V) ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంతార (Kantara) సినిమాలో తను పాడిన ప్రసిద్ధ పాటలతో పాటు పలు ప్రజాదరణ పొందిన హిట్లతో ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేశారు. వేలాది మంది జనం ఆయన పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.

సంస్కృతి, రుచులు వినోదం..
ఈ వేడుకల్లో భారత్ వైవిధ్యమైన సంస్కృతి ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
సాంస్కృతిక ప్రదర్శనలు: క్లాసికల్ బాలీవుడ్ డ్యాన్స్ ప్రదర్శనలతో పాటు, ‘బాలీవుడ్ సింగ్ అలాంగ్’, ‘తంబోలా’ ఆటలు ఆకట్టుకున్నాయి.
భారతీయ రుచులు & షాపింగ్: విభిన్న రకాల భారతీయ వంటకాలతో కూడిన ఫుడ్ స్టాళ్లు, దుస్తులు పండుగ వస్తువుల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
కిడ్స్ జోన్: పిల్లల కోసం ప్రత్యేక ఆటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకను విజయవంతం చేయడానికి సహకరించిన శాన్ హోస్ సిటీ యంత్రాంగానికి, స్పాన్సర్లు సంజీవ్ గుప్తా CPA, లావణ్య దువ్వి, నాగరాజ్ అన్నాంబయ్య, ట్రావెలపోడ్లతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు, వాలంటీర్లకు AIA బొల్లి 92.3 FM యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

